వైయస్సార్ కడప,ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) జిల్లాలోని అర్హులైన 189 మంది జర్నలిస్టులకు రెండవ విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపిందనీ డిఎంఎసి చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.బుధవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ డీఎంఎస్సీ చైర్మన్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.మొదటి విడతలో 538 మంజూరు కాగా రెండో విడతలో 189 మందికి కమిటీ ఆమోదం తెలిపిందనన్నారు.ఇంకా అర్హత ఉన్న పాత్రికేయులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి మరియు వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి సమావేశం లో అక్రిడిటేషన్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశం లో ఇంచార్జ్ డీఆర్వో వెంకటపతి,డిఎంఎసి కన్వీనర్ నెంబర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని పద్మజ,డివిజనల్ పీఆర్వో సునీల్ సాగర్,ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి ,అసిస్టెంట్ లేబర్ కమిషనర్, రైల్వే పీఆర్వో జనార్ధన్,బ్యూరో చీఫ్ విశాలాంద్ర పి.రామసుబ్బా రెడ్డి, స్టాఫ్ రిపోర్టర్ ప్రజాశక్తి నూర్ బాషా,స్టాఫ్ రిపోర్టర్ ఈ టివి జి.మురళి మోహన్ గౌడ్, స్టాఫ్ రిపోర్టర్ హెచ్ యంటివి వి.యం.చంద్ర మోహన్ రాజు,రిపోర్టర్ ఆంధ్రప్రభ ఐ.సి.సుబ్బారెడ్డి,ఎడిటర్ రాయలసీమ సమయం ఏ.సందీప్ కుమార్ రెడ్డి,ఎడిటర్ కొత్త తరంగం కె.రమేష్,స్టాఫ్ రిపోర్టర్ మహా న్యూస్ యు శ్రీకాంత్, కరస్పాండెంట్ ప్రసార భారతి బి.శ్రీనాథ్ రెడ్డి, ఫోటోగ్రాఫర్ ఆంధ్ర జ్యోతి టి.రత్నయ్య,తదితరులు పాల్గొన్నారు.