రెండేళ్లలో కర్నూలు జిల్లాకు భారీగా పెట్టుబడులు.మంత్రి టీజీ భరత్ గుప్తా.రిలయన్స్, జైరాజ్ ఇస్పాత్ కంపెనీలతో యువతకు ఉద్యోగావకాశాలు,మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు జూన్ 08 ప్రజావాణి జిల్లా ఎంతో అభివృద్ది చెందిందని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు.కర్నూలు నగరంలోని బి.క్యాంపులోని కాపు భవన్ వద్ద కర్నూలు నగర తెలగ కాపు బలిజ సేవా సంఘం ప్రతిభ పురస్కారాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఆయన పురస్కారాలు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. మొదటగా రిలయన్స్ ప్రాజెక్టును రూ.2500 కోట్లు అనుకుంటే.ఇప్పుడు రూ.6వేల...