*రెండు టన్నుల సింగరేణి ఇనుప సామాగ్రి స్వాధీనంరెండు టన్నుల సింగరేణి ఇనుప సామాగ్రి స్వాధీనం*
* *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 7
సింగరేణి సంబంధించిన రెండు టన్నుల విలువైన ఇనుప సామాగ్రిని మంగళవారం సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది (ఎస్ అండ్ పిసి) సిబ్బంది పట్టుకోవడం జరిగిందని ఏరియా సెక్యూరిటీ అధికారి (ఏఎస్ఓ) వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని విద్యానగర్ లో గల హనుమాన్ స్క్రాప్ దుకాణంలో సింగరేణికి సంబంధించిన ఇనుప సామాగ్రి పెద్ద ఎత్తున ఉన్నదని ఇంటిలిజెన్సి కె శ్రీనివాస్ రావు కు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఏరియా సెక్యూరిటీ అధికారికి సమాచారం ఇవ్వగా, వెంటనే ఆయన స్పందించి ఎస్ అండ్ పిసి జూనియర్ ఇన్స్పెక్టర్ బోయిని ఓదెలు, ఐడి పార్టీ దాసరి మల్లేష్, ఇతర సిబ్బంది ఆ దుకాణంపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనం (టీఎస్ ఓయు డి 4242)లో లోడ్ చేసి, తీసుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వాహనాన్ని, ఇనుప సామాగ్రితో సహా పెట్టుకున్నారు. ఆ వాహనంలో సింగరేణికి సంబంధించిన సుమారు 2180 కిలోల ఇనుప సామాగ్రి ఉన్నదని, దాని విలువ సుమారు 43600 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇనుప సామాగ్రి తో పాటు ఆ వాహనాన్ని సింగరేణి ఏరియా ఎస్ అండ్ పిసి కార్యాలయానికి తరలించి, పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ అండ్ పిసి సిబ్బంది పాల్గొన్నారు.