రూ.70 లక్షలు ఖర్చు చేసి అప్పుల్లో మునిగిన టీడీపీ కార్యకర్త… ఎమ్మెల్యే నిర్లక్ష్యంపై బడే మదన్ ఆవేదన

ఎన్టీఆర్ జిల్లా ఏప్రిల్8(ప్రజావాణిన్యూస్) రూ.70 లక్షలు ఖర్చు చేసి అప్పుల్లో మునిగిన టీడీపీ కార్యకర్త,ఎమ్మెల్యే నిర్లక్ష్యంపై బడే మదన్ ఆవేదన అధికారుల నిర్లక్ష్యం కార్యకర్త జీవితాన్ని నాశనం చేసిన నీరు చెట్టు పనులు.ఎన్టీఆర్ జిల్లా షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన బడే మదన్ అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది.దాదాపు 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ,పార్టీ కోసం తన జీవితాన్ని అర్పించిన ఈ కార్యకర్తను ఇప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.2016 నుండి...