రూ.2కే 20 లీటర్ల నీరు – మాట నిలబెట్టుకున్న ముల్కనూరు సర్పంచ్
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామంలో ప్రజల దాహాన్ని తీర్చే నిజమైన ప్రజా నాయకత్వం ఎలా ఉండాలో సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య చూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గాలికి వదిలేయకుండా, కేవలం రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ అందించే పథకాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించి గ్రామ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.“మాట ఇచ్చి మరిచిపోయే నాయకులు చాలామంది ఉంటారు… కానీ మాట నిలబెట్టుకునే నాయకత్వం అరుదు” అని గ్రామ ప్రజలు గర్వంగా...