రుయా ఆస్పత్రికి రూ.50 లక్షల విలువైన అధునాతన అంబులెన్స్ విరాళం
ఈసీఐఎల్ సీఎస్ఆర్ నిధులతో అందజేత.. పేద రోగులకు అత్యవసర వైద్య సేవలు మరింత మెరుగ్గాతిరుపతి, జూలై 22 (ప్రజావాణి): తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాల పరిధిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), హైదరాబాద్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా సుమారు రూ.50 లక్షల విలువైన అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రత్యేక అంబులెన్స్‌ను బుధవారం విరాళంగా అందజేసింది.ఈ సందర్భంగా అదనపు వైద్య విద్య సంచాలకులు, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. మనోహర్...