prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:42 am Digital Edition : PRAJA VANI

రుణానుబంధ రూపేనా పశుపత్ని సుతాలయ

*ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయ…*

*రుణం ఉంటేనే మనదరి  చేరుతారు.*

*పూర్వజన్మలో చేసుకున్న ఋణాన్ని బట్టే భార్య భర్తల వివాహబంధం.*

*ఋణమనేది లేకుంటే ఎవరిని కలలో కూడా చూడలేము.*

*ఋణం తీరిపోతే ఏ బంధము నిలవదు.*

*ఋణం ధనం కాదు.. బాంధవ్యం.*

*ఋణం లేనిదే తృణం కూడా ముట్టదు.*

*స్వర్ణగిరి ఆలయ ప్రధానార్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి జులై 29*

ఋణము ఉంటేనే తప్ప ఏవీ కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న ఋణం బట్టి భార్య కాని, భర్త కాని వివాహబంధంతో  ఏకమవుతారు. అలాగే  పిల్లలు పుట్టాలన్నా వారి ఋణము  మనకు ఉండాలి. ఇక ఇంట తిరిగే పశువులు. ఏ ఇతరమైనా కూడా ఋణము ఉంటేనే తప్ప మనకు దక్కవు. అంతెందుకు ఋణము ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు. బాంధవ్యాలు కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడినా. లేక మాట కలిపినా కూడా  అది కూడా ఋణాను బంధమే..ఋణమనేది లేకుంటే ఎవరిని కలలో కూడా మనం చూడలేమని  పురాణ గ్రంథాలు చెబు తున్నాయి. ఇక ఋణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు. ఈ ఋణానుబంధం విలువ తెలుసుకుని మసలు కోవాలి..ఋణం కేవలం ధనం మాత్రమే కాదు , బాంధవ్యం కూడా. అందుకే ధన బంధం కంటే ఈ బంధానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి “మానవతా విలువలు మరచిపోతున్న ఈ సమాజంలో  ఋణాను బంధం విలువ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి”
భగవద్ బంధువులారా, ఋణం లేనిదే తృణం కూడా ముట్టదు అని మన పెద్దలు చెప్పారు. ఇది నిజం మనం ఎంత యత్నించినా కూడా ఋణం లేకపోతే ఏది జరగదు. ఏ బంధం నిలువదు.  ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధ పడ కండి నిందించకండి. ఆ బంధం అంత వరకే అని అర్థం చేసుకోండి. దూరం గా ఉన్నా మన వాళ్లేగా. ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా వాళ్ల సంతోషాన్ని కోరుకోండి.