రీసర్వే పనులను చురుగ్గా చేపట్టాలి.జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.
కడప జిల్లా రీసర్వే పనులను చురుగ్గా చేపట్టాలి.జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల స్వచ్చీకరణ, రీ సర్వే పనులను.. జిల్లాలో ప్రణాళిక ప్రకారం చురుగ్గా చేపట్టాలని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.బుధవారం రాష్ట్ర రాజధాని నుండి రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర భూ పరిపాలనా శాఖ (సీసీఎల్ఏ) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో కలిసి.. భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా రెవెన్యూ క్లినిక్స్, పిజిఆర్ఎస్, మ్యుటేషన్స్ (ఉత్పరివర్తనలు),...