రిత్విక్ కంపెనీ ముట్టడి దిగివచ్చిన యాజమాన్యం! రైతుల 10 రోజుల నిరసనలకు ఫలితం.. చర్చలు సఫలం
పంట నష్టాలు, బోర్లు బూడిపోవడంపై రైతుల ఆగ్రహం రోడ్డు నిర్మాణం, వాటర్ ప్లాంట్లకు కంపెనీ ప్రతినిధుల హామీ కడప జిల్లా జూలై 13 ప్రజావాణి బ్రహ్మంగారి మఠం మండలం రేకలకుంట పంచాయతీ పరిధిలోని రైతులు గత 10 రోజులుగా చేపట్టిన శాంతియుత నిరసనలు ఎట్టకేలకు ఫలించాయి. తమ సమస్యలపై స్పందించాలంటూ స్థానిక రిత్విక్ కంపెనీ ఎదుట రైతులు ఆందోళనలు చేపట్టగా,సోమవారం కంపెనీ యాజమాన్యం రైతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ చర్చల్లో రైతుల డిమాండ్లకు కంపెనీ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో వివాదం సద్దుమణిగింది. రేకులకుంట,బాలాజీ...