రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఘట్‌కేసర్‌లో కాంగ్రెస్ శాంతి ర్యాలీ

ఘట్‌కేసర్, జూలై 23: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, ఆధ్వర్యంలో గురువారం శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్...