రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బీరంగూడలో రోడ్డుపై కాంగ్రెస్ బైఠాయింపు
•రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బీరంగూడలో రోడ్డుపై కాంగ్రెస్ బైఠాయింపు *కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని కాంగ్రెస్ విమర్శ పటాన్‌చెరు, జూలై 22 (ప్రజావాణి): విద్యార్థులపై పోలీసుల దాడులను నిరసిస్తూ ఢిల్లీలో ప్రధాని నివాసాన్ని ముట్టడించే కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బుధవారం బీరంగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని గుట్ట కమాన్ వద్ద అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి...