prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 3:00 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రాసలీలలు… లంచాలు వసూళ్లు,,రక్షకబటులే భక్షక భటులు అయితే ఎవరికి చెప్పుకోవాలి

పల్నాడుజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)పలువురు పోలిస్ అధికారులు,సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.రాసలీలలు.లంచాలు వసూళ్లు.కంచె చేను మేస్తే కాపరి ఏమి చేయు అన్న చందంగా.రక్షకబటులే భక్షక భటులు అయితే ఎవరికి చెప్పుకోవాలి.ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది.మహిళలను పోలీస్ స్టేషన్లోనే పోలీసులు గద్దలై మానప్రాణాలను దోచుకుంటుంటే ఆ మహిళలు ఇంకెక్కడికి వెళ్లాలి.ఎవరికి చెప్పుకోవాలి.కూటమి ప్రభుత్వాధి నేతలారా? రాష్ట్రంలో మహిళల మానప్రాణాలు దోచుకుంటున్నారు చూడండి.రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే సహించేది లేదని,చొక్కా పట్టుకొనిప్రశ్నిస్తానని ఊగి.ఊగి.వాగ్దానాలు ఇచ్చిన నాయకుడు ఎటుపోయాడు.పదవి వస్తానే ప్రజలు ఏమైపోయినా?మహిళలు ఏమైపోయినా తనకెందుకు అనుకుని మౌనం దాల్చారా
పోలీస్ శాఖకే బాసుగా ఉన్న స్వయానా మహిళా మంత్రి నిద్రపోతున్నారా?పదిహేను రోజుల్లో.పరువు
మొత్తం పాయే.పల్నాడు జిల్లా లో పలువురు పోలిస్ అధికారులు,సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.ఆ జిల్లాలో పదిహేను రోజుల్లో కొందరు సిబ్బంది చేసిన నిర్వాహకం వల్ల మొత్తం పోలీస్ శాఖా పరువు పోయిందనిపలువురు పోలిస్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్టేషన్ కు వచ్చిన మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఒక సిఐ పై బదిలీ వేటు పడగా పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సిఐ సస్పెండ్ అయ్యాడు.బాద్యులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు.ఇవి ముగిసే లోపే ఎ ఎస్ ఐ రాసలీలల వీడియో హాల్ చల్ తో 15 రోజుల్లో పలువురు సిబ్బంది వల్ల పరువు పోతుందని ఆ శాఖకు చెందిన అధికారులు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రాణాలను ప్రణంగా పెట్టి ప్రజలను కాపాడతారని ఆ శాఖపై ప్రజలకు ఓ నమ్మకం.కానీ కొందరు సిబ్బంది చేసే నిర్వాహకాలవల్ల మొత్తం వ్యవస్థకే మాయని మచ్చగా చెడ్డపేరు వస్తోంది.