రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్ పోటీలకు విద్యార్థిని జావళి ఎంపిక
రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్ పోటీలకు బీర్పూర్ విద్యార్థిని ఎంపిక జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి మార్చి 18 (ప్రజావాణి): జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ పోటీల్లో బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జావళి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయింది. వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థుల మధ్య సాగిన ఈ హోరాహోరీ పోటీల్లో జావళి తన వాగ్ధాటితో అందరినీ అబ్బురపరిచారు. క్యూబా ప్రతినిధిగా మెరిసిన జావళి, ఈ పోటీల్లో...