రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి. హనుమంతరావుకు ఘన సన్మానం
ఘాట్ కేసర్, మే 16 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి శాఖ గౌరవ సలహాదారుగా నియమితులైన వి. హనుమంతరావు ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వి. హనుమంతరావు గారి అనుభవం, సేవలు రాష్ట్రంలోని బీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి మరింత దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో వెనుకబడిన తరగతులకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందాలని...