ఘాట్ కేసర్, మే 16 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి శాఖ గౌరవ సలహాదారుగా నియమితులైన వి. హనుమంతరావు ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వి. హనుమంతరావు గారి అనుభవం, సేవలు రాష్ట్రంలోని బీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి మరింత దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో వెనుకబడిన తరగతులకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ లోకేష్ యాదవ్ (టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ మరియు స్ట్రాటజీ కమిటీ సభ్యుడు), ఘట్‌కేసర్ సర్కిల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, యంనంపేట్ గ్రామ శాఖ అధ్యక్షుడు సహదేవ్ గౌడ్, పోలగోని లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
