రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ర్యాంకర్ ను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రజావాణిన్యూస్:రాయచోటి ఇటీవల విడుదల చేసిన రాష్ట్రీయ మిలిటరీ స్కూల్(ఆర్ఎంఎస్)పరీక్ష ఫలితాలలో అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మురళి యుపి స్కూల్ విద్యార్థి పని రామ్ వర్మ 150 మార్కులకు గాను138 మార్కులతో దక్షిణ భారతదేశంలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల శనివారం రాష్ట్ర రవాణా,యువజన,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఆర్ఎంఎస్ ర్యాంకు సాధించిన పణి రామ్ వర్మ తల్లిదండ్రులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా...