నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 04) నెల్లూరు, “రాయలసీమ ఎత్తిపోతల కార్యాచరణ” రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నందున ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్ రెడ్డి,రాయలసీమ ఎత్తిపోతల కార్యాచరణ పై నెల్లూరు జిల్లాలో శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రధాన నాయకులు, రైతులతో కలిసి, రాయలసీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామన్న కాకాణి జిల్లా వ్యాప్తిగా రైతుల తోపాటు, రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొని భవిష్యత్ కార్యాచరణ పై ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించిన కాకాణి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ఎత్తిపోతలను సాధించి నెల్లూరు జిల్లా రైతాంగానికి భవిష్యత్తులో సాగునీటి కష్టాలు రాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేసిన కాకాణి నెల్లూరు గాంధీనగర్ ఆర్ఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జిల్లా స్థాయి రైతులు, నాయకులతో కలిసి , రౌండ్ టేబుల్ సమావేశం రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తాం రైతులు, స్థానిక నాయకులతో ,కలిసి కూలం కుశంగా చర్చించిన తర్వాత కార్యాచరణను ప్రకటిస్తాం మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి,ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమగ్ర సోమశిలను ,సమగ్ర కండలేరును సాధించుకున్నాం రైతుల ఆశలకు,ఆకాంక్షలకు,నాడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనిచేస్తే ,ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుండి 800 అడుగుల దిగువ భాగాన రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోవడంతో ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతుంది,
చంద్రబాబు,తెలంగాణ ప్రభుత్వం తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అక్రమ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినా నోరు మెదపలేదు చంద్రబాబు ఉదా సీన వైఖరి వల్ల తెలంగాణ ప్రభుత్వం ఇబ్బడి,మొబ్బిడిగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి,రోజుకు 8 టిఎంసిల నీరు తరలించుకుపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంతం అక్రమంగా సాగునీరు తరలించడం చూసి,సహించలేక ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి కూడా శ్రీశైలం జలాశయం నుండి తమ వాటాగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాడు ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీరు తరలించే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేశాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో తానే మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపుదల చేయించానని ప్రకటించాడు చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి తో రహస్య ఒప్పందం కుదుర్చుకొని ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి సాగునీటి అవసరం, చంద్రబాబు ద్వారా జరుగుతున్న అన్యాయం సమగ్రంగా చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం రేపటి సమావేశానికి రైతులు,స్థానిక నాయకులు,తరలివచ్చి తమ అమూల్యమైన సలహాలు ఇచ్చి, జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నా