రామగుండంలో మిన్నంటిన సేవా కార్యక్రమాలు
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు గోదావరిఖని ,జూలై24, ప్రజావాణి: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా శ్రమిస్తున్న నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోజంతా పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. రామగుండం ఐటీ పార్క్ ఏర్పాటుకు, నగర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుకు కేటీఆర్ ఎంతో కృషి చేశారని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం...