prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 1:45 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రామకీర్తన మృతికి రెడ్యం సోదరుల సంతాపం

కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)ఖాజీపేట తల్లి,దండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన రెడ్యం సోదరులు,ఆవుల వెంకటేష్ కు ఉరి శిక్ష పడాల్సిందే.బెయిల్ రాకుండా పోలీసులు చర్యలు తీసుకావాలి  రెడ్యం సోదరులు ఖాజీపేట అగ్రహారానికి చెందిన రామకీర్తన ప్రేమోన్మాది ఆవుల వెంకటేశ్ చేతిలో అత్యంత పాశవికంగా శుక్రవారం హత్యగావించబడిన రామకీర్తన (16) మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ అనంతరం శనివారం మధ్యాహ్నం స్వస్థలం అగ్రహారంలోని వారి స్వగృహానికి తీసుకురావడం జరిగినది వైయస్సార్ సిపీ కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, వైయస్ఆర్సీపీ నేత కె.సి కెనాల్ ప్రాజెక్టు మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డిలు రాముకీర్తన మృతదేహంపై పూల మాలవేసి ఘననివాళి అర్పించి, సంతాపం వ్యక్తపరిచారు. రామకీర్తన తల్లి ఇల్లూరు నాగమణి,తండ్రి ఇల్లూరు శ్రీనివాసులు, వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు.ఉన్మాది, నిందితుడు ఆవుల వెంకటేస్ కు శిక్ష పడేంత వరకు తాము అండగా ఉంటామని రెడ్యం సోదరులు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రెడ్యం సోదరులు మాట్లాడుతూ ప్రేమోన్మది వెంకటేష్ కు ఉరిశిక్షపడేలా శిక్ష పడేంత వరకు బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని అక్కడకు వచ్చిన పోలీసు అధికారులను రెడ్యం సోదరులు విజ్ఞప్తి చేయగా వారు సానుకూలంగా స్పందించారు.