prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 9:57 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసిన సూపర్డెంట్ డాక్టర్ భాను తేజ….

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏప్రిల్ 14, ప్రజావాణి న్యూస్ ఆశయాలను ఆచరణలో పెడితే.. మానవుడే మహనీయుడవుతాడు.ఇదే బీఆర్‌ అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతం.తిరువూరు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచమేధావి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసిన సూపర్డెంట్ డాక్టర్ భాను తేజ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ భాను తేజ మాట్లాడుతూ ఆశయాలను ఆచరణలో పెడితే.. మానవుడే మహనీయుడవుతాడు.ఇదే బీఆర్‌ అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతం అని డాక్టర్ భాను తేజ తెలియజేశారు.అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ సమాజ ఉన్నతికి దోహదకారులు అవుతారు.ఆయన విలువలు కలిగిన వ్యక్తులుగా మన దేశం పౌరులు రూపొందించాలని ఆకాంక్షించారు. వ్యక్తులు నైతిక విలువలు పాటించి ఆయనకు,ఆయన రచించిన రాజ్యాంగానికి, మొత్తం ఈ సమాజానికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం తేవాలని ఉన్నతమైన సమాజం, ఉన్నతమైన వ్యక్తులు అంటే విలువలు కలిగి ఉన్న సమాజం, విలువలు కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమేనన్నారు. ఆయన తెలిపిన మార్గం లో విద్యార్థులు, యువత, ఉద్యోగులు సమాజమంతా నిజాయితీ, కఠిన శ్రమ, దీన జనరక్షణ, శాంతికాముకులైనడిచి మన సమాజం గొప్ప సమాజంగా పేరు ప్రఖ్యాతులు పొందాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన రెండవ దేశంగా ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని దానికి ప్రతి ఒక్కరూ తమపాత్ర పోషించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ వీరమ్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు