రాజారాంపల్లిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు రక్షణ కవచాలు జగిత్యాల డీఎస్పీ కె. పురుషోత్తం రెడ్డి జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, జూలై 06 (ప్రజావాణి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నేరాలను చాలా వరకు అరికట్టవచ్చని జగిత్యాల డీఎస్పీ కె. పురుషోత్తం రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో 'కమ్యూనిటీ పోలీసింగ్', 'నేను సైతం' కార్యక్రమాల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు....