రాజారాంపల్లిలో మహిళా సంఘాల నూతన భవనం ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 08 (ప్రజావాణి): రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో మణిదీప, వినాయక గ్రామ పరస్పర సహాయక పొదుపు, పరపతి సహకార సంఘం నూతన భవనాన్ని...