రాజరాంపల్లిలో ఎస్సై ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు

జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి పర్యవేక్షణలో వెల్గటూర్ ఎస్సై పి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఈరోజు మాదక ద్రవ్యాల కోసం తనిఖీలు చేపట్టారు. డాగ్, బాంబ్ స్క్వాడ్‌లతో కిరాణా, పాన్ షాపులు, బస్టాండ్‌లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై యువత అప్రమత్తంగా ఉండాలని, సమాచారం తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్సై ఉదయ్ కుమార్ సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.