prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 2:33 pm Digital Edition : PRAJA VANI

రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *రగుడు చెక్‌పోస్ట్ వద్ద రూ. 2 లక్షల నగదు సీజ్..*

*రాజన్న సిరిసిల్ల జిల్లా:://*

 

*రగుడు చెక్‌పోస్ట్ వద్ద రూ. 2 లక్షల నగదు సీజ్..*

 

 

 

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం భారీగా నగదు పట్టుబడింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రగుడు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జగిత్యాలకు చెందిన అనందుల శ్రీనాథ్ అనే వ్యక్తి తన కారులో తరలిస్తున్న రూ. 2,00,000 నగదును పోలీసులు గుర్తించారు. సదరు నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఎస్ఎస్టీ బృంద ఇన్‌చార్జ్ మీర్జా అఫజల్ అహ్మద్ బేగ్ పంచుల సమక్షంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు సిరిసిల్ల టౌన్ ఇన్ స్పెక్టర్ కె. కృష్ణ తెలిపారు.