prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 4:08 pm Digital Edition : ASHOK THIRUPATHI

రాజనాల బండ పై విశేష పూజలు

మన ప్రజావాణి  చౌడేపల్లి  ఫిబ్రవరి 07

రాష్ట్రంలోని సత్య ప్రమాణాలకు పేరుగాంచిన మండలంలోని రాజనాల బండ పై శనివారం విశేష పూజలు జరిగాయి, టీటీడీ ఆధ్వర్యంలో ఉదయాన్నే ప్రధానార్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీ నరసింహ స్వామి క్షేత్రపాలకుడు ప్రసన్న ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొందరు ప్రమాణాలు చేయగా మరికొందరు వాయిదాలు వేసుకొని వెళ్లారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది విశేష సంఖ్యలో వచ్చిన భక్తులకు టీటీడీ సిబ్బంది సేవలు అందించారు.