రాజకీయ కక్షతోనే జడ్పిటిసి చిన్న పోల్ రెడ్డిపై అక్రమ కేసులు: ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

ప్రజావాణి న్యూస్:(మార్చి 10) బద్వేల్ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న జడ్పిటిసి వంకల చిన్న పోల్ రెడ్డిని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోయాయని ఆక్షేపించారు. ఒక కేసు తర్వాత మరో కేసు నమోదు చేస్తూ పార్టీ నాయకులను మానసిక ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని అన్నారు.ఎన్నికలకు ముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ "రెడ్ బుక్"లో పేర్లు నమోదు...