prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 3:08 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రాజకీయాలు అనే క్రీడలో..రంగులు మార్చే నాయకులు. ఉన్నంతకాలం.. ఈ దేశం మారదు.

అవినీతి చేసినోడు.ప్రజావాణిన్యూస్(మార్చి24 అధికారి అవుతాడు.పంటపండించేవాడుఅడుక్కు తింటాడు.కష్టపడి చదివేవాడు నిరుద్యోగి అవుతాడు.న్యాయంగాఉండేవాడు నాశనం అవుతాడు.ఇదే మన 78 ఏళ్ల స్వాతంత్ర దేశం.ఇంకా చెప్పాలంటే.ఈ దేశంలో పేదవారు ఉన్నారు కానీ.పేద దేశం కాదు.అభివృద్ధి ఉంది.అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు.కారణాలు ఇవే.మనం అంబులెన్స్ కి ఫోన్ చేస్తే.దానికంటే ముందు పిజ్జా మన ఇంటికి వస్తుంది.కారులోనుకు వడ్డీ 5 శాతం అయితే.చదువుకోవడానికి మాత్రం బ్యాంకులు వసూలు చేసేది 12 శాతం వడ్డీ.మనం కాళ్లకు వేసుకునే చెప్పులు ఏసీ రూమ్ లో కొంటున్నాం.అదే తినే ఆహార పదార్థాలు మాత్రం రోడ్డుపైన కొంటున్నాం.పర్యావరణం,కాలుష్యం చేసే ఫ్యాక్టరీలకు 24 గంటలు కరెంటు ఇస్తున్నాం.కానీ దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్నకు మాత్రం 9 గంటల కరెంటు ఇస్తున్నాం.78 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ.భారతదేశంలో నేటికీ రూపాయికి కిలో బియ్యం.మరియు ఐదు రూపాయల అన్నం కోసం క్యూ లైన్ లో నిలబడుతున్నాం అంటే దేశంలో పేదరికం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి.లిక్కర్ కి ఆశపడి మగవాళ్ళు.కుక్కర్ కి ఆశపడి ఆడవాళ్లు.ఓట్లు వేస్తే చివరికి నిక్కర్ కూడా లేకుండా చేస్తారు.ఈ నాయకులు.ఎర్రచందనం అమ్మినవాడే నిజమైన సజ్జనుడు ప్రభుత్వ ప్రైవేటు’దేవాలయ భూములను ప్లాట్లగా విభజించి అమ్ముకున్నవాడే నిజమైన రాష్ట్ర నాయకుడు.కోట్లుకొల్లగొట్టి మన్ను తిన్న పాము వలె ఉండేవాడే నేడు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలకు అసలైన  పిఏ అధిక ఫీజులు వసూలు చేసి  విద్యసేవ చేస్తున్నాను అన్న వాడే నిజమైన విద్యావేత్త.వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజలను జలగళ్ల పీల్చి పిప్పి చేసిన వారే నిజమైన కార్పోరేట్ వైద్యులు. బడికి ఎగనామం పెట్టి ప్లాట్ల వ్యాపారం చేసిన వాడే  నికార్సైన ఉపాధ్యాయుడు.అవసరం నీది అవకాశం నాది అని వ్యాపారం చేసేవాడే నిజమైన వడ్డీ వ్యాపారి.గుడిని లింగాన్ని మింగేవాడే అసలైన ఆలయ ధర్మకర్త.ఆరు పదుల వయసులో రాసలీలలు” చేసేవాడే పవిత్ర ఆలయానికి చైర్మన్.ఉన్న ఊర్లో పలకరించేవాడు గతి లేకపోయినా.రాష్ట్రస్థాయిలో నాయకుడైనట్లు ఫోజులీ ఇచ్చేవాడే  నిజమైన అవకాశవాది.సేవ ముసుగులో స్వాహా చేసేవాడే నిజమైన పత్రికా విలేఖరి.తాను చేసిన చీకటి వ్యాపారం బయటపడకుండా కాపాడేందుకు నాయకులకు ఫార్చ్యూనర్లు,వోల్వాలు,బహుమతులు ఇచ్చిన వాడే అసలైన ఎర్రచందనం వ్యాపారి.ఇలా చెప్పుకుంటూ పోతే  కొండవీటి  శాంతాడంత అవుతుంది