prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 5:00 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రాజంపేట బైపాస్‌లోని తిరుమల బార్‌ లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం

ప్రజావాణిన్యూస్(మార్చి24)కడప జిల్లా రాజంపేట బైపాస్‌లోని తిరుమల బార్‌ లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.బార్ ముందు ఉన్న ఫ్లెక్సీలు,రేకులు మంటల్లో కాలిపోయాయి.క్షణాల్లోనే మంటలు భారీగా చెలరేగి స్థానికులను భయాందోళనకు గురి చేశాయి.ప్రాథమిక సమాచారం ప్రకారం:రేకులపై ఏర్పాటు చేసిన బార్ విద్యుత్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ తగలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం.సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.వారి వేగవంతమైన చర్యలతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. హెచ్చరిక:భవనాల్లో సరైన విద్యుత్ భద్రతా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడైనా సంభవించే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించాలి.