సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 8 ప్రజావాణి
రబీ (యాసంగి) సీజన్ 2025-26 వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి అధికారులను ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ రబీ సీజన్ 2025-26 వరి కొనుగోలు ఏర్పాట్లపై ఆర్డీవోలు, సివిల్ సప్లై, మెప్మా, డిఆర్డీఏ, తహసీల్దార్లు, డిసిఓ, డిఏఓ, డీఎం మార్కెటింగ్ తదితర అధికారులకు సమగ్ర దిశానిర్దేశం చేశారు.జిల్లా లో ఈ రబీ సీజన్‌లో అంచనాలకు మించి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి మండలంలో తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఏపిఎం, మహిళ సమాఖ్య ఓపిఓలు, మార్కెటింగ్, అగ్రికల్చర్ అధికారులతో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.జిల్లాలోని 421 కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, తాలు తీసే యంత్రాలు, టార్పాలిన్ షీట్లు, బ్లోయర్లు, తాగునీటి సదుపాయం, టెంట్లు, విద్యుత్ కనెక్షన్, వేయింగ్ మిషన్లు, కార్మికులు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతి కేంద్రాన్ని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించాలని తెలిపారు.మార్కెట్ గోదాముల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తించి నిల్వ సదుపాయాలు కల్పించాలని, అవసరమైతే కాటన్ మిల్లులను కూడా వినియోగించుకోవాలని డీఎం మార్కెటింగ్‌ను ఆదేశించారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలని సివిల్ సప్లై, డీఎం సివిల్ సప్లై మరియు సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డి సివిల్ సప్లై తనూజ, డీఎం సివిల్ సప్లై అధికారి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు…