prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 5:03 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రండి..రారండి..పద్మశాలీయులు ఐక్యత చాటే తరుణం రానే వచ్చింది.చేయి చేయి కలుపుదాం.పద్మశాలీల ఐక్కతను చాటుదాం….

కడప(జూన్ 06) ప్రజావాణి నగరంలోని పద్మశాలి సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాసా కోదండ రామ్ మాట్లాడుతూ.కడపజిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా దేవరకొండు శివకుమార్, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా పద్మ తిరుమలేష్, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా పుత్తా శ్రీనివాస్ లను ప్రకటించారు.పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.కడప జిల్లా పద్మశాలీయ ఆత్మీయ సమ్మేళనం 07-06-2026వ తేదీ ఆదివారం ఉదయం గం.10.00లకు కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరుగుతుంది. కావున ప్రతి ఒక్క పద్మశాలీ కులబాధవులు ఈ సమ్మేళనానికి విచ్చేసి,మన సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.పద్మశాలీయులు సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో చాలా వెనుకబడియున్నారు. అలాగే చేనేత పరిశ్రమ నిరాధరణకు గురైనది. కాబట్టి మనమంతా ఏకతాటిపైకి వచ్చి మన సత్తా చాటవలసిన సమయం ఆసన్నమైనది.మన హక్కులను మనం సాధించుకుని, మన ఆత్మగౌరవాన్ని చాటాలి. కావున మన కులబాంధువులు 07-06-2026 వ తేది జరిగే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరై మన సమస్యల పరిష్కారానికి, తమవంతు కర్తవ్యం నిర్వహించాలని అన్నారు.ఈ సమావేశంలో కడప అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు నూకల చిన్న కుళాయప్ప, కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కాలువ ధనలక్ష్మి, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు మఠం రాజా కడప అసెంబ్లీ నియోజకవర్గ ఉద్యోగ విభాగం అధ్యక్షులు జింక జనార్ధన్ పాల్గొన్నారు.