రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తోపాలు పంపిణీ
తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోపాలు పంపిణీ చేశారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై ముస్లిం కుటుంబాలకు తోపాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ త్యాగం, సేవా భావం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర ప్రేమాభిమానాలతో పండుగలను జరుపుకోవడం ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడుతుందని పేర్కొన్నారు....