*రంగారెడ్డి జిల్లా బిగ్ బ్రేకింగ్*
*ప్రజావాణి న్యూస్ జులై 11*
*రంగారెడ్డి జిల్లాలో ఘోరం: షాబాద్‌లో ఆరు మంది మర్డర్ ..*
*నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉన్నట్టుగా తెలుస్తుంది*
*నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది పోలీసులు బృందాలతో గాలింపు*
*నిందితుడు రాజు కుమార్ (28) గాలిస్తున్న పోలీసులు…*
*తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు బాధిత బాలిక, బాలిక తల్లి, నానమ్మ హత్య…*
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో తీవ్ర కలకలం రేగింది. ఒకేసారి ఆరు మంది దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడే స్వయంగా పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆపై తాను కూడా ప్రాణాలు తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
రెండు వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలు
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం… నిందితుడు అత్యంత కిరాతకంగా ఈ మారణహోమానికి పాల్పడ్డాడు. ఒక ప్రాంతంలో ముగ్గురిని, మరో ప్రాంతంలో ఇంకో ముగ్గురిని చంపినట్లు తెలుస్తోంది.
“నేనే ఆరు మందిని మర్డర్ చేశాను… ఒకచోట ముగ్గురిని, మరొకచోట ముగ్గురిని హతమార్చాను” అంటూ నిందితుడు స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.
“నేను కూడా చచ్చిపోతున్నా…” నిందితుడి హెచ్చరిక
ఆరు మందిని పొట్టనబెట్టుకున్న సదరు వ్యక్తి, పోలీసులతో మాట్లాడుతూ… “కొద్దిసేపట్లో నేను కూడా చచ్చిపోతున్నాను” అని సంచలన ప్రకటన చేశాడు. ఈ మాటతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
విషయం తెలియగానే రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు, భారీగా పోలీసు బందోబస్తుతో షాబాద్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని, అసలు ఈ దారుణానికి గల కారణాలు ఏంటి?
పాత కక్షలా?
లేక కుటుంబ కలహాలా?
అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
ఒకే రోజు ఆరు మంది హత్యకు గురికావడంతో షాబాద్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…


