రంగసముద్ర పంచాయతీలోని రెవెన్యూలో ‘నోట్ల’ జాతర: హైకోర్టును సైతం బురిడీ కొట్టించిన వీఆర్వో.. కాసుల కక్కుర్తిపై రైతుల తీవ్ర ఆగ్రహం!
*మూడు కోర్టుల్లో కేసులు నడుస్తున్నా సాహసం..413 సర్వే నంబర్ భూమిని 417 గా మార్చి ఆన్‌లైన్ నమోదు! *డబ్బులిస్తే చాలు.ఎవరి భూమైనా వేరేవాళ్ల ఖాతాలోకి! *లంచాల మత్తులో చట్టాలను, న్యాయస్థానాలను తుంగలో తొక్కిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. *దిక్కుతోచని స్థితిలో అమాయక రైతులు. పోరుమామిళ్ల జూలై 10 ప్రజావాణి రంగసముద్ర పంచాయతీలోని నర్సింగ్ పల్లె గ్రామంలో"డబ్బులు ఇస్తే చాలు.ఎవరి భూమినైనా,ఎవరి పేరైనా ఆన్‌లైన్ రికార్డుల్లోకి ఎక్కించేస్తాం"అంటూ బహాటంగానే అవినీతి దందాకు తెరలేపాడు వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీకి చెందిన ఓ విలేజ్...