కడప జిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి26)పోరుమామిళ్ల మండలం రంగసముద్రం చెరువు కాలువలు,తూములు,చెరువులో పూడిక తీయుటకు ప్రత్యెక నిధులు మంజూరు చేసి రైతులకు బాసటగా నిలవాలని తెలుగుదేశం పార్టి రంగసముద్రం పంచాయతి ఇంచార్జి తిరుమలశెట్టి సుబ్బారావు,తెలుగుదేశం పార్తీ నాయకులు ఇండ్ల రామిరెడ్డి,పి.పుల్లయ్య,,కె.గురప్ప,చెన్నారెడ్డి,చెన్న కృష్ణారెడ్డి,గ్రామ ప్రజలు కడప జిల్లా కలెక్టర్,తెలుగుదేశం పార్టి అధిష్టానం కు విన్నవించారు. వారు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రంగసముద్రం చెరువు క్రింద దాదాపు 1000 ఎకరాలు ఆయకట్టు కలదు.ఇంతటి ఆయకట్టు కలిగి ఉన్న చెరువును అధికారులు,పాలకులు పట్టించుకోక నిర్లక్ష్యం గా ఉండటంతో చెరువు దట్టమైన ముల్లపొదలతో నిండిపోయి తూములు శిథిలమైపోయాయి.పోరుమామిళ్ల పెద్ద చెరువు నుండి రంగసముద్రం చెరువుకు మల్లకతవ ద్వారా నీళ్ళు అందించే బెల్లగోడి కాలువ,పోరుమామిళ్ల ఆర్టిసి బస్టాండ్ దగ్గర ఉన్న కప్పల కాలువ లు పూడిక తో నిండి చెత్తా చెదారంతో,ముళ్ళ పొదలతో నిండి గత 25 సంవత్సరాలుగా చెరువులోకి నీళ్ళు రాక చెరువు కింద ఆయకట్టు నిలువునా పోలాలన్ని ఎండిపోయాయి.బోర్లల్లో భూగర్భ జల మట్టం పడిపోయింది.దీనిని దృష్టిలోపెట్టుకొని రంగసముద్రం నీటిసంఘం చైర్మెన్ చెరుకూరి వీరచెండ్రా యుడు తెలుగుగంగ అధికారులు ద్వారా మరమ్మత్తులు చేయుటకు దాదాపు 20 లక్షల ఎస్టిమేషన్ పంపితే పై స్థాయి ఆధికారులు మంజూరు చేయలేదు.దీంతో చెరువు మరమ్మత్తులు జరగక ముళ్ళపొదలకే పరిమితం అయ్యింది.ప్రస్తుతం పూడికతో నిండి పోయి ఉంది.అనేక పర్యాయాలు చెరువు పూడిక తీయుట కు నిధులు మంజూరు చేయమని అర్జిల రూపంలో ఇచ్చినా పట్టించుకోలేదు.వేసవి కాలంలో పనులు మంజూరు చేస్తే వర్షాకాలం లోపల పూర్తీ చేసి చెరువుకు నీళ్ళు రప్పించి ఆయకట్టు భూముల్లో పచ్చని పైర్లతో చూడవచ్చు.దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా కడప జిల్లా కలెక్టర్ మరియు తెలుగుదేశం అధిష్టానం ప్రత్యెక నిధులు మంజూరు చేసి చెరువుకు నీళ్ళు ఇచ్చి రైతుల భూములను పైర్లతో కళకళలాడే విదంగా చూడాలని కోరుచున్నాము