యూరియా సంక్షోభం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రైతాంగం ఆగ్రహం చెన్నూరు,జూలై26,ప్రజావాణి: రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ, క్షేత్రస్థాయిలో ఎరువుల కొరత రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రధాన పంటలైన వరి, పత్తి సాగుకు అత్యంత కీలకమైన యూరియా సకాలంలో లభించక రైతులు సొసైటీలు, ప్రైవేటు దుకాణాల ముందు గంటల తరబడి క్యూ కడుతున్నారు. అయితే ఈ తీవ్ర యూరియా కొరతకు అటు కేంద్ర ప్రభుత్వ సరఫరా లోపాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు ప్రణాళికా రాహిత్యం , క్షేత్రస్థాయి నిర్వహణ...