నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) నెల్లూరు సిటీ పరిధిలోని రామ్మూర్తి నగర్ లో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఏర్పాటు చేసిన “టెక్ మైండ్ ఐటి సొల్యూషన్ “సంస్థను పర్వత రెడ్డి ప్రమోద్ కుమార్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు”డా”కాకాణి గోవర్ధన్ రెడ్డి.మాజీ మంత్రి కాకాణికి ఘన స్వాగతం పలికిన యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు-ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ- స్థానిక యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి పదిమందికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగాలి-రాబోయే రోజుల్లో సాఫ్ట్‌వేర్ రంగానికి విపరీతమైన ఆదరణ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన సాంకేతికతలతో అనేక సవాళ్లు, అవకాశాలు వస్తున్నాయి-యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా,స్వతహాగా సంస్థలను నెలకొల్పి ఐటి రంగంలో రాణించాలని ఆకాంక్షిస్తున్నా- తాము ఎదగడమే కాకుండా మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే యువ టెక్నోస్ ఆలోచన అభినందనీయం టెక్ మైండ్ ఐటి సొల్యూషన్ సంస్థ అనేక రంగాలలో సేవలందించాలని ఆర్థికంగా బలోపేతం కావాలని,భవిష్యత్తులో మరిన్ని శాఖలను ప్రారంభించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నా నూతనంగా సంస్థను ప్రారంభించిన యువతకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా