వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి ఆదర్శ పాఠశాలలో బుధవారం అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం ప్రిన్సిపల్ సందీప్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్గటూర్ ఎస్సై పి. ఉదయ్ కుమార్, మాట్లాడుతూ… విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, మానసిక స్థితి దెబ్బతింటుందని, కుటుంబాలు రోడ్డున పడతాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చదువుపైనే దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.