గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే14) గుంటూరు యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టండి ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి డ్రెయిన్ల నిర్మాణం వేగవంతం చేయండి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించండి* అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తూర్పు నియోజకవర్గంలో డ్రెయిన్లు,రోడ్లు, విద్యుత్ సరఫరా ట్రాఫిక్ వంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే నసీర్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు.బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మున్సిపల్ శానిటేషన్,విద్యుత్ ఇంజనీరింగ్,ట్రాఫిక్ పోలీసులో కలిసి ఎమ్మెల్యే నసీర్ వివిధ ప్రాంతాలకు పరిశీలించారు. తొలుత జిన్నా టవర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు చేపట్టిన డ్రెయిన్ల నిర్మాణానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఈ ప్రాంతం ట్రాఫిక్ రద్దీగా ఉంటుందని, త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. మణిపురం బ్రిడ్జి వెంట సర్వీసు రోడ్డులో మౌలిక వసతిల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి కబడ్డీ గూడెం ప్రాంతంలో పర్యటించారు. అక్కడ డ్రెయున్ల విస్తరతోపాటు శ్మశాన వాటికలో వసతుల కల్పనపై చర్చించారు. కొత్తపేటలోని బ్రింద న్యూరో కేర్ వద్ద డ్రెయిన్ నిర్మాణంపై చర్చించారు. అదే సమయంలో ఆటోనగర్ ప్రధాన డ్రెయి్ నిర్మాణం విషయంలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆటోనగర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని,ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాంతాన్ని సమాన స్థాయిలో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నామని స్పష్టం చేశారు