ప్రజావాణి: బద్వేల్ పట్టణ కమిటీ సమావేశం కామ్రేడ్ సి.సుబ్బరాయుడు అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి అంతర్జాతీయ జాతీయ రాజకీయ పరిస్థితులు సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ నేడు పశ్చిమ ఆసియా లోని ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ ఏకపక్షంగా దాడులు చేయడాని వివరిస్తూ… ఇరాన్ భూభాగంలోని హార్మూజ్ జలసంధి ఆయిల్ రవాణాకు కీలక ప్రదేశంపై ఆధిపత్యం కోసం అమెరికా,ఇజ్రాయిల్ ఏకపక్షంగా అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘిస్తూ యుద్ధం చేస్తున్నాయని ఆరోపించారు.ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించలేక ప్రజలపై దాడి చేస్తున్న అమెరికా దుర్మార్గాలను ప్రపంచ ప్రజాఅనుకూల మేధావులందరూ ఖండించాలన్నారు. లాటిన్ అమెరికా దేశాలలో ప్రజా అనుకూల అభ్యుదయ, ప్రగతిశీల ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని ఈ పరిణామం అమెరికా ఇజ్రాయులకు చంప దెబ్బ అన్నారు. ప్రపంచంలో ఓటమిపాలైన పెట్టుబడిదారీ వ్యవస్థ వందరెట్లు బలంతో తిరిగి నేడు దాడి చేస్తోందని ప్రపంచ ప్రజలందరూ , అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికా సామ్రాజ్యవాదం పట్ల జాగృతితో ఉండాలన్నారు. కేంద్రంలోని బిజెపి భారతదేశ అలిగిన విదేశాంగ విధానం విడనాడి, పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపట్ల సానుకూల వైఖరిని విస్మరించి, సామ్రాజ్యవాద అనుకూల విదేశాంగ విధానం అనుసరిస్తోందని ఇది బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలకు అర్థం పడుతోందని విమర్శించారు.ఏ దేశంలోనైనా ప్రజల భాగస్వామ్యం మరింత పెరగడం ద్వారానే సోషలిస్టు వ్యవస్థల నిర్మించుకోవడం గాని, కాపాడుకోవడం గాని సాధ్యపడుతుంద అన్నారు.బిజెపి, ఎంఐఎం మతాలను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. బిజెపి పెరిగే కొద్దీ సతీసహగమనాని పునరుద్ధరించాలనే డిమాండ్ ముందుకు వస్తుందని, సీ, పురుష సమానత్వం వెనక్కి నెట్టీ పురుషాధిక్య సమాజం పునర్ధన జరుగుతుందని వారు తెలిపారు.కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు, గ్రామీణ పేదరికాన్ని , ఆర్థిక అసమానతలను పెంచుతున్నాయని విమర్శించారు. ఈ.వీ.ఎంస్, వి.వి.పాడ్స్ పై వస్తున్న విమర్శలు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఎస్.ఐ.ఆర్. ఎన్నికల ఫలితాలు తారుమారు చేసేందుకు చట్టబద్ధమైన ఓటర్లు లేకుండా చేసేందుకే బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా అమలు చేస్తుందని ఆరోపించారు.నేటి దేశంలో పేదల, అనగారిన వర్గాల ఓట్ల హక్కులను ఎస్.ఐ.ఆర్. తొలగించుకుంటూ పోతోందని ఇది దేశ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి లౌకిక వ్యవస్థకు ఫెడరల్ వ్యవస్థకు పెద్దవిగాతంగా ప్రణయమిస్తుందని దేశంలో అంతర్గత శాంతి పద్ధతుల సమస్యను ముందుకు తెచ్చిపెడుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బద్వేలు పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు చాంద్ బాషా, పట్టణ కమిటీ సభ్యులు మోక్షమ్మ సుబ్బరాయుడు రాయప్ప, బద్వేల్ రూరల్ మండల కార్యదర్శి డి వెంకటేష్ అట్లూరు మండల కార్యదర్శి ఈ.వి.రమణ తదితరులు పాల్గొన్నారు