యాదాద్రి దేవస్థాన పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించనున్న తుళ్ల విజయేందర్ గౌడ్‌కు ఘన సత్కారం

ఘట్కేసర్, జూలై 19: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులైన మాజీ హోంమంత్రి తుళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు తుళ్ల విజయేందర్ గౌడ్ సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమానికి యాదగిరిగుట్టకు వెళ్తున్న సందర్భంగా ఘట్కేసర్‌లో ఘన స్వాగతం లభించింది. ఘట్కేసర్‌లోని వందనం హోటల్ సమీపంలో స్థానిక నాయకులు, అభిమానులు కలిసి తుళ్ల విజయేందర్ గౌడ్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఘనాపూర్ మాజీ సర్పంచ్ వేముల సంజీవ్ గౌడ్, పాటి సురేందర్...