prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:57 am Digital Edition : VEMULARAMESH MOTHE

యాదాద్రిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…* *నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.*

*యాదాద్రిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…*

*నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14

 

 

 

 

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య అంబేద్కర్ విగ్రహానికి పులామాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రోజు అవగహన కల్పించడం కోసం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలచే ప్రతినిధులచే ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ రూపకర్తగా , సామాజిక న్యాయానికి మార్గదర్శిగా , అణ గారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ , విద్యను ఆయుధంగా తీసుకుని ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించి , భారతదేశానికి గొప్ప దిశా నిర్దేశం చేశారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన చేసిన గొప్ప కృషి. సమాజంలో ఉన్న అస మానతలను తొలగించేందుకు , కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనిది. “విద్య పొందండి సంఘటిత మవండి పోరాడండి” అనే ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకం.
ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలు , దళితులు , బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి కొనసాగుతోంది. యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చదువులో ముందుండి , సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలి. సమానత్వం , సోదర భావం , న్యాయం అనే విలువలను మన జీవితంలో ఆచరించాలి. చివరగా మనమందరం కలిసి అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉండాలిని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య అన్నారు.