యాక్సిడెంట్ బాధిత యువకుడికి గల్ఫ్ సేవా సమితి రూ.5 వేల ఆర్థిక సాయం
బెజ్జంకి, జూన్ 14(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కళ్ళేపల్లి గ్రామానికి చెందిన పబ్బతి ఆశీర్వాద్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని దవడ ఎముకలు విరగడంతో పాటు కుడి కన్ను చూపు కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్‌లోని ధృవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆశీర్వాద్ వైద్య ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో అతని కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్తులు, దాతలను కోరుతున్నారు.ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గల్ఫ్ సేవా...