ఘట్‌కేసర్, ఏప్రిల్ 27 (ప్రజావాణి): మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని యంనంపేట్ గ్రామంలో ఉన్న శ్రీశ్రీశ్రీ గోదా దేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన దేవాలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మండల అధ్యక్షుడు కర్రే రాజేష్, టీం రేవంత్ సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హాజరై నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని నియమించినట్లు నిర్వాహకులు తెలిపారు.
దేవాలయ కమిటీ చైర్ పర్సన్ గా నర్రి మంజుల శ్రీశైలం బాధ్యతలు స్వీకరించగా, డైరెక్టర్లుగా నల్లరాళ్ల శ్రీలత రెడ్డి, పొలగోని లక్ష్మణ్, పొలగోని మమత, పత్తేపు శ్రీహరి, మీసాల సుభాష్, నక్క భాస్కర్ బాధ్యతలు చేపట్టారు.
చైర్ పర్సన్ నర్రి మంజుల శ్రీశైలం మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని, దేవుడు సేవలో ఎల్లప్పుడూ ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈవో భాగ్యలక్ష్మి, గ్రామ శాఖ అధ్యక్షుడు సహదేవ్, ఇటికాల కృష్ణారెడ్డి, బద్దం నరసింహారెడ్డి, నరేష్ గౌడ్, మాజీ సర్పంచ్ రాములు, మాజీ దేవాలయ చైర్మన్ పొలగోని రాజేష్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేష్ నాయక్, మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, మాజీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
