మ్యాక్ సొసైటీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి మహోత్సవాల్లో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రత్యేక పూజలు
పటాన్‌చెరు, జూన్ 28(ప్రజావాణి): భారతి నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ సొసైటీలో జరుగుతున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి 8వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో జీవించాలని ఆమె ప్రార్థించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గౌరవ అధ్యక్షులు నందగోపాల్, సత్యనారాయణ, అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు యాదగిరి, నరసింహారావుతో పాటు కమిటీ సభ్యులు సుధాకర్, విజయ్, సంతోష్, రవి, రామకృష్ణ, భాను, సాయిలు సింధు ఆదర్శ్ రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.