మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలకై ఆహ్వానం

వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో 2026-27కు గంటల ప్రాతిపదికన పీజీటీ - ఇంగ్లీష్-2, బోటనీ-1, మ్యాథ్స్-1. టీజీటీ - ఇంగ్లీష్-1, మ్యాథ్స్-1, సైన్స్-1 పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పీజీటీకి పీజీ, బి.ఎడ్, టీజీటీకి డిగ్రీ, బి.ఎడ్, టెట్ అర్హతలుండాలి. ఆసక్తి గలవారు జూన్ 16 సాయంత్రం 4 గంటల్లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కె సందీప్ రాజు పత్రికా ముఖంగా తెలిపారు. జూన్ 17న డెమో ద్వారా ఎంపిక చేస్తామన్నారు.