మొల్కచర్ల గ్రామంలో ఘనంగా బడిబాట కార్యక్రమం.
ప్రజావాణి న్యూస్ అడవిదేవులపల్లి. మండల పరిధిలోని మొల్కచర్ల గ్రామంలో ఎంపీయుపిఎస్ హెడ్మాస్టర్ కిషోర్ నాయక్ మరియు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం కిషోర్ నాయక్ మాట్లాడుతూ పి ఎం శ్రీ నిధుల కింద అనేక వసతులు కల్పించబడి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యా బోధన జరిగే ప్రభుత్వ పాఠశాల లకే విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని అంతేకాకుండా ఈ రోజుల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వారంతా నాడు ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వారే అని ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పదనాన్ని కొని ఆడారు. అంతేకాకుండా గతంలో గురుకుల సీట్లు కూడా మన పాఠశాల నుంచే ఎక్కువ మొత్తంలో విద్యార్థులు ర్యాంకులు సాధించడం అది ప్రత్యేక ముల్కచర్ల ఉపాధ్యాయ బృందం యొక్క కృషి ఫలితమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీను పద్మావతి లక్ష్మీ ప్రసన్న విజయలక్ష్మి కృష్ణయ్య వీరేష్ ప్రదీప్ గ్రామ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
