prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 12:56 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మైనార్టీ సంక్షేమ పథకానికి నేడు లబ్ధిదారుల ఎంపిక

మైనార్టీ సంక్షేమ పథకానికి నేడు లబ్ధిదారుల ఎంపిక

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 04 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల పరిధిలోని అర్హులైన మైనార్టీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ (ఓబీబీఎంఎస్) వేదికగా దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ పథకం కింద ఎండపల్లి మండలానికి మొత్తం 3 యూనిట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ యూనిట్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మే 5, మంగళవారం రోజున జరగనుంది. ఉదయం 11:00 గంటలకు ఎండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ ఇంటర్వ్యూకు, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దొండ కృపాకర్ కోరారు. ఇంటర్వ్యూ ద్వారా పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.