prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 9:07 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మైనర్ బాలిక ఘటనలో గురువుపై అనుమానం, కేసు నమోదు ఆదేశం

ప్రజావాణి (ఏప్రిల్23) మదనపల్లెలో  మైనర్ బాలిక ఘటనలో గురువుపై అనుమానం, కేసు నమోదు ఆదేశం10వ తరగతి మైనర్ బాలిక ప్రసవించిన ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనపై స్పందించిన డీఎస్పీ పావని ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని విచారించారు.విచారణలో బాలిక గర్భానికి సంబంధించి పాఠశాలకు చెందిన గురువుపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై డీఎస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తాలూకా సీఐ కళా వెంకటరమణకు ఆదేశించారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో వెలికితీస్తున్నారు