prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 2:03 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

మైనర్ బాలికకు మాయమాటలు.. నగదు, బంగారంతో ఉడాయించిన విద్యార్థులు

మైనర్ బాలికకు మాయమాటలు.. నగదు, బంగారంతో ఉడాయించిన విద్యార్థులు

 

ఇద్దరు ఇంటర్ విద్యార్థులపై కేసు నమోదు

 

చెన్నారావుపేట ఏప్రిల్ 18 (ప్రజావాణి)

 

 

ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను నమ్మించి, ఇంట్లోని నగదు, బంగారంతో ఉడాయించిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులపై చెన్నారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఒక తండాకు చెందిన మైనర్ బాలిక (8వ తరగతి) నివాసానికి, ఈ నెల 12వ తేదీన పక్క గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు వెళ్లారు. వారిలో ఒక విద్యార్థి సదరు బాలికకు నిన్ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటాను అంటూ మాయమాటలు చెప్పి నమ్మించాడు.బాలికను మాటల్లో పెట్టి, ఆమె ఇంట్లో ఉన్న రూ. 3 లక్షల విలువైన 2 తులాల బంగారు గొలుసుతో పాటు రూ. 50 వేల నగదును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు జరిగిన విషయాన్ని గమనించి ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.