మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు.. రూ2వేల నుండి 5 వేల వరకు జరిమానా “వీరాపూర్ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం”

బెజ్జంకి, ఆగస్టు 6 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలో మైనర్లు వాహనాలు నడపకుండా కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గ్రామంలో పెరుగుతున్న ర్యాష్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రామ సర్పంచ్ చిలుముల సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 6 నుంచి మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలు ఇచ్చి నడిపించిన తల్లిదండ్రులకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధించడంతో పాటు, సంబంధిత మైనర్‌ను పోలీసులకు అప్పగిస్తామని...